Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naakentho Aanandam Nee Sannidhi Prabhuvaa

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

Naakentho Aanandam Nee Sannidhi Prabhuvaa

Verse
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే‖ 2x నాకెంతో ఆనందం… ‖
Verse
ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక‖ 2x ‖
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా‖ 2x నాకెంతో ‖
Verse
నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని‖ 2x ‖
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా‖ 2x నాకెంతో ‖
Verse
నూతన యెరూషలేం నా గమ్యమేనని
నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా‖ 2x ‖
నీవుండు స్థలములో నేనుండ గోరెదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా‖ 2x నాకెంతో ‖

Related Tags

WorshipThanksgivingPresence