Chorus
నాకొరకై అన్నియు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో
Pre-Chorus
నాకొరకై అన్నియు చేసినందులకు
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్
Verse
క్షామమందు ఏలేయాకు అప్పమించెను
క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్
క్షామం తీరే వరకు ఆ విధవరాలి
ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు
Verse
ఆకాశపక్షులను గమనించుడి
విత్తవు అవి పంటను కోయవు
వాటిని పోషించునట్టి ప్రమపితా - మమ్ము
అనుదిన మద్భుతంబుగా నడుపున్
Verse
ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పుష్పములను తేరిచూడుము
అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే
నిశ్చయంబుగా మమ్ము అలంకరించును
Verse
రేపటి దినము గూర్చి చింతపడకు
ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ
నాటికీడు ఆనాటికే ఇలచాలును
Verse
ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదువేలమందిని కూడ
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు
తన్ను తానే అర్పించెను నా కొరకై