Verse
నాకు చాలిన దేవుడ నీవు
నా కోసమే మరణించావు‖ 2x ‖
నా శ్రమలలో నా ఆధారమా
నను ఎడబాయని నా దైవమా‖ 2x ‖
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఏ రీతిగా నిను స్తుతియించగలను‖ 2x నాకు చాలిన ‖
Verse
వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె
మౌనివై నా పాప శిక్షణోర్చినావు‖ 2x ‖
అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా‖ 2x ‖
చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా‖ 2x ఏమిచ్చి ‖
Verse
ఎండిన భూమిలో లేత మొక్క వోలె
నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా‖ 2x ‖
సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో‖ 2x ‖
నడవలేక సుడి వడి కూలినావయ్యా‖ 2x ఏమిచ్చి ‖