Chorus
నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు
లోకంలో ఉన్నవారికంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు
వేలెత్తి చూపలేని పరిశుద్ధుడు వెల్పులలో అటువంటి వాడెవడు
Verse
రాతి నుండి నీళ్ళను ఇచ్చినాడు
రాకాసి అలలను అనచినాడు
సంద్రాన దారినే వేసినాడు
సంతోష వస్త్రమే ఇచ్చినాడు
Verse
లాజరు లేచి రా అని పిలిచినాడు
మరణపు ముళ్ళును విరచినాడు
మరణించి తిరిగి మరలా లేచినాడు
మా కొరకు మరలా రానున్నాడు
Chorus
నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు
లోకంలో ఉన్నవారికంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు
వేలెత్తి చూపలేని పరిశుద్ధుడు వెల్పులలో అటువంటి వాడెవడు