Verse
నాలో నిన్ను చూడనీ నీతో బ్రతుకు సాగని
నీ వాక్యపు వెలుగులో అందరు నన్ను చూడని
Verse
లోకమునకు వెలుగుగా అందరికి ఉప్పుగా
కుంచముపై దీపముగా కొండమీది పట్టణముగా
అందరు నాలో నిను చూచి
డెందములో నిను స్తుతియింపని
Verse
నూతనమగు సృష్టిగా పరమునకు సాక్షిగా
పరిశుద్ధాత్మకు నిలయముగా ప్రభువా నీకే ఆలయముగా
పరిశుద్ధముగా జీవించి
నీకే మహిమను కలిగించ