Verse
నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
నాలోని సమస్తమా
అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి
నను వెలిగించే నా దీపమా
యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ..‖ 2x ‖
Verse
ఆకాశమునుండి వర్షింపజేయువాడవు
ఎండిన నేలను చిగురింపజేయువాడవు‖ 2x ‖
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా‖ 2x ‖
Verse
కోతకాలములో పంటనిచ్చేవాడవు
భూమినుండి ఆహారం పుట్టించువాడవు‖ 2x ‖
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా‖ 2x ‖