Verse
నాలో ఉన్న ఆనందం
నాకున్న సంతోషం
నా జీవన ఆధారం నీవే కదా‖ 2x నాలో ‖
Verse
నా ఆశ్రయము నా దుర్గము
నా కోట నీవే యేసు
నా బలము… నా యేసుడే‖ 2x ‖
Verse
గాఢాంధకారములో నే సంచరించిననూ
ఏ అపాయమునకు నే భయపడను‖ 2x ‖
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నాదరించును నా యేసయ్యా‖ 2x నా ఆశ్రయము ‖
Verse
నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును
నన్నాదరించును నా వెంట వచ్చుఁను‖ 2x ‖
చిరకాలము నేను నీ మందిరావరణములో
నివాసము చేసెదను నా యేసయ్యా‖ 2x నా ఆశ్రయము ‖