Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naalo Unna Aashalanniyu

నాలో ఉన్న ఆశలన్నియు

Naalo Unna Aashalanniyu

Verse
నాలో ఉన్న ఆశలన్నియు
నాలో ఉన్న ఊహలన్నియు
నాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా నీవే నా మార్గం
యేసయ్యా నీవే నా సత్యం
యేసయ్యా నీవే నా జీవం
నీవే నా ప్రాణం
Verse
నాకున్నవన్ని నీకే యేసయ్యా
నాలోన నిన్ను దాచానేసయ్యా‖ 2x ‖
నీ చేతులలో నా రూపమునే ముద్రించితివి
నా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి‖ 2x ‖
పరిశుద్ధమైన రక్తము ద్వారా
పాపాలన్ని కడిగివేసితివి‖ యేసయ్యా ‖
Verse
నా కోసమే ఈ భువికి వచ్చితివి
నా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి‖ 2x ‖
నా హృదయములో నీ వాక్యమునే నే ఉంచితిని
నీ రాకకై నేను వేచి ఉంటిని‖ 2x ‖
పరిశుద్ధమైన నీ చేతులలో
నీ రూపములో నన్ను చేసితివి‖ యేసయ్యా ‖

Related Tags

WorshipDevotionalSurrender