Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naalo Unnavaadu Naakai Nilachuvaadu

నాలో ఉన్నవాడు నాకై నిలచువాడు

Naalo Unnavaadu Naakai Nilachuvaadu

Lyricist: Sumanth Gudivada, Kranthi Sandeep Vedala
Verse
నాలో ఉన్నవాడు నాకై నిలచువాడు
పరిశుద్ధుడు పరమాత్ముడు ప్రభుయేసు
నాకై ఉన్నవాడు నను ప్రేమించువాడు
అతిశ్రేష్టుడు బలవంతుడు నా యేసు
Verse
లోక పాపమే తను మోసెను
పాప రహితునిగా నను చేసెను
ఆయన స్వాస్థ్యముగా నను నిలిపెను
నన్ను శుద్ధునిగా తను చేసెను
Verse
నా చెడుక్రియలతో తన హృదయమే గాయమైన
పాపపు పనులతో తన మదినే నేను తొలచినా
ఇకను లోకమే నేను ఎంచుచుండగా
కృపతో రుధిరమే నాకు ధారబోసెను
Verse
నాలో ఉన్నవాడు నాకై నిలచువాడు
పరిశుద్ధుడు పరమాత్ముడు ప్రభుయేసు
నాకై ఉన్నవాడు నను ప్రేమించువాడు
అతిశ్రేష్టుడు బలవంతుడు నా యేసు

Related Tags

PraiseWorshipChristmas