Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naapraana Priyuda Naayesu Raaja

నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా

Naapraana Priyuda Naayesu Raaja

Verse
నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా
నా యేలినవాడా...ఆ - నా స్నేహితుడా‖ 2x ‖
నిన్ను చేరాలనీ... నీతో ఉండాలనీ...‖ 2x ‖
నిన్ను వలచానయా... నీవు నా సొంతం
నిన్ను వలచానయ్యా... యేసయ్యా నీవు నా సొంతం‖ నాప్రాణ ‖
Verse
నీస్వరమునే వింటిని ప్రాణము సొమ్మసిల్లె యేసయ్యా
నీ ముఖమునే చూచితిని మనసానందమాయనహా‖ 2x ‖
నీ ప్రేమను రుచిచూచితి నీ వశమయితిని యేసయ్యా‖ 2x ‖
నీ వశమయితిని యేసయ్యా‖ నాప్రాణ ‖
Verse
నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా‖ 2x ‖
నిన్ను హత్తుకొని నీవడిలోన నిదురించాలని వుందయా‖ 2x ‖
నిదురించాలని వుందయా‖ నాప్రాణ ‖

Related Tags

WorshipDevotionalJesus