Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naatho Maatlaadumayya Nannoo Darshimchumayya

నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించుమయ్యా

Naatho Maatlaadumayya Nannoo Darshimchumayya

Chorus
నాతో మాట్లాడుమయ్యా - నన్నూ దర్శించుమయ్యా
నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను - నింపుమయా
యేసయ్యా .... ఆ.. ఆ.. యేసయ్యా .. ఆ..ఆ.. యేసయ్యా... ఆ ఆ..యేసయ్యా .... యేసయ్యా....
Verse
కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా
కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా ....‖ యేసయ్యా ‖
Verse
నావారే నన్ను నిందించేవేళ - నను విడచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేర్చి ఓదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై
నిత్యము నను నడిపించుమయ్యా ....‖ యేసయ్యా ‖
Verse
నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజాచి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను బంధించేవేళ - నను చేరి విడిపించుమయ్యా
నీ చెతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా ....‖ యేసయ్యా ‖

Related Tags

WorshipPrayerGuidance