Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naatho Neevu Maataadinacho

నాతో నీవు మాటాడినచో

Naatho Neevu Maataadinacho

Lyricist: Chatla Devasahaayam
Verse
నాతో నీవు మాటాడినచో
నే బ్రతికెదను ప్రభు‖ 2x ‖
నా ప్రియుడా నా హితుడా
నా ప్రాణ నాథుడా నా రక్షకా‖ నాతో ‖
Verse
యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను‖ 2x ‖
బుద్ధి మీరినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు‖ నాతో ‖
Verse
కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను
వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము‖ 2x ‖
గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి
దిక్కు లేక నేను దయను కోరుచుంటి
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు‖ నాతో ‖

Related Tags

WorshipPrayerRepentance