Verse
నాతోడు నీవు నిలచితివే
నీ ప్రేమ నాపై చూపితివే‖ 2x ‖
నను వెంటాడే నీ కృప క్షేమములే
నను కాచే నీ కరుణ కటాక్షములే‖ 2x ‖
Chorus
యేసయ్య నీకే స్తోత్రము...‖ 4x ‖
Verse
అగ్ని గుండములో సింహపు బోనులో
నను రక్షించు వారెవరు లేక
నే ఒంటరినైయున్న వేళా
నిలిచావు నాకై తోడుగా
నిలిపావు నన్ను నీదు సాక్షిగా
నను చేసావు నీ రక్షణకే రుజువుగా
Chorus
యేసయ్య నీకే స్తోత్రము...‖ 4x ‖
Verse
అనారోగ్యములో వ్యాధిబాదలో
నను స్వస్థపరచు వారెవరులేక
నే వేదనలో క్రుంగియున్న వేళా
తాకావునన్ను నీ చేతితో
స్వస్థ పరచావు నన్ను నీదు వాక్కుతో
నను చేసావు నీ ప్రేమ్మతో పరిపూర్ణముగా
Chorus
యేసయ్య నీకే స్తోత్రము...‖ 4x ‖