Verse
నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన భావంబునను నేను బహుదైర్యమొందెద
Verse
నీకు నా ప్రాణము నిజముగ నర్పించి నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద
Verse
సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని నిత్యంబు గరముల నీ సేవ జేసెద
Verse
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు ఆశచే నడిపించు మరల నా పదములు
Verse
పెదవులతో నేను బెంపుగ నీ వార్త గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి
Verse
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ యావంత యైనను నాశించ మదిలోన
Verse
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు
Verse
చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము
Verse
హృదయంబు నీకిత్తు సదనంబు గావించి పదిలంబుగా దాని బట్టి కాపాడుము