Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naavanni Yangeekarinchumee

నావన్ని యంగీకరించుమీ

Naavanni Yangeekarinchumee

Lyricist: Pulipaaka Jagannaathamu
Verse
నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన‖ 2x ‖
భావంబునను నేను బహుదైర్యమొందెద‖ నావన్ని ‖
Verse
నీకు నా ప్రాణము నిజముగా నర్పించి‖ 2x ‖
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద‖ నావన్ని ‖
Verse
సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని‖ 2x ‖
నిత్యంబు గరముల నీ సేవ జేసెద‖ నావన్ని ‖
Verse
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు‖ 2x ‖
ఆశచే నడిపించు మరల నా పదములు‖ నావన్ని ‖
Verse
పెదవులతో నేను బెంపుగ నీ వార్త‖ 2x ‖
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి‖ నావన్ని ‖
Verse
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ‖ 2x ‖
యావంత యైనను నాశింప మదిలోన‖ నావన్ని ‖
Verse
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే‖ 2x ‖
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు‖ నావన్ని ‖
Verse
చిత్తము నీ కృపా యత్తంబు గావించి‖ 2x ‖
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము‖ నావన్ని ‖
Verse
హృదయంబు నీకిత్తు సదనంబు గావించి‖ 2x ‖
పదిలంబుగా దాని బట్టి కాపాడుము‖ నావన్ని ‖

Related Tags

PrayerDevotionOffering