Chorus
నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య
మొందెద‖ నావన్ని ‖
Verse
నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీఁదుఁగట్టి నీ కొరకు
నిల్పెద‖ నావన్ని ‖
Verse
సత్యంబు నీ ప్రేమ చక్కఁగా మదిఁ బూని నిత్యంఉఁ గరముల నీ
సేవఁ జేసెద‖ నావన్ని ‖
Verse
నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా
పదములు‖ నావన్ని ‖
Verse
పెదవులతో నేను బెంపుగ నీ వార్తఁ గదలక ప్రకటింపఁ గలి గించు
దృఢ భక్తి‖ నావన్ని ‖
Verse
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమీ యావంతయైనను
నాశింప మదిలోన‖ నావన్ని ‖
Verse
నీవు నా కొసఁగిన నిర్మల బుద్ధిచే సేవఁ జేయఁగ నిమ్ము స్థిర భక్తితో
నీకు‖ నావన్ని ‖
Verse
చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్లకుండఁగ మార్గంబుఁ
దెలుపుము‖ నావన్ని ‖
Verse
హృదయంబు నీ కిత్తు సదనంబుగావించి పదిలంబుగా దానిఁ బట్టి
కాపాడుము‖ నావన్ని ‖