Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naayaathma Langaruveya Susthira Bhoomi Chikkenu

నాయాత్మ లంగరువేయ సుస్థిర భూమి చిక్కెను

Naayaathma Langaruveya Susthira Bhoomi Chikkenu

Verse 1
Reference: నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను కీర్తన Psalm 40:2
Verse
నాయాత్మ లంగరువేయ - సుస్థిర భూమి చిక్కెను
నా పాపము హరించెడు - నిత్యుండౌ యేసుగాయముల్
కల్పాంతకాలమైనను - సదా యీ ప్రేమనిల్చును
Verse
తండ్రీ! నీ ప్రేమ నిత్యమై - మాయల్ప బుద్ధిని మించు
నీ యుల్లమందు సర్వదా - కారుణ్యముండినందున
మరలివచ్చు పాపులన్ - జేర్చి జీవింప జేతువు
Verse
నీ ప్రేమ లోతుతేలదు - మేమెన్న శక్యముగాదు
నా పాపమంత దాచితి నిర్దోషిగా నన్నెంచితి
శ్రీయేసు పుణ్యముండగా - ధారాళ కృపనిత్తువు
Verse
నా కష్టముల్ తుఫానుగా - నా తలపైన క్రమ్మిన
లోకేచ్ఛలన్ని భంగమై - యసౌఖ్యముల్ ప్రాప్తించిన
నీ ప్రేమ నిత్యము కాగా - నదే నాయాత్మలంగరు
Verse
హృదయ భీతియుండిన - ప్రపంచము లయించిన
నీ వన్ని కదిలింపుము - నాలంగర్ స్థిరమై యుండి
ననంత ప్రేమ శక్తిని అనుభవింతు

Related Tags

FaithGraceHope