Verse
నాయేసు నామ శబ్దము
ఎంతో యింపైనది
భయాదులెల్ల దీరిచి
విశ్రాంతి నిచ్చును.
Verse
ఆకలిగొన్న యాత్మకు
అదే మన్నాయగు
ప్రయాసపడ్డవారికి
ఫలము నిచ్చును.
Verse
ఈ ప్రియమైన నామము
నిరీక్షణిచ్చును
నాదుర్గమైన స్థానము
కృపానిలయము.
Verse
నా యేసు దివ్యనామము
సుక్షేమ నిధియౌ
నా దిక్కులేని యాత్మకు
సమృద్ధినిచ్చును.
Verse
యేసూ నీవే నాకాపరి
నా రక్షకా, రాజా,
నా ప్రభువా, నా జీవమా!
నా స్తుతి పొందుము.
Verse
నీ ప్రేమ ప్రకటింతును
నా చావు వరకు
నీ నామ సంకీర్తనము
నన్నాదరించును.