Verse
నడవాలని యేసు నడవాలని
నడవాలని నీతో నడవాలని
నాకున్న ఆశ నీపైనే ధ్యాస‖ 2x ‖
నిరంతరం నీతోనే నడవాలని‖ 2x ‖
Verse
హానోకు నీతో నడిచాడు దేవ
పరలోకపు నడకతో చేరాడు నిన్ను‖ నడవా ‖
Verse
నోవాహు నీతో నడిచాడు దేవ
రక్షణనే ఓడలో రక్షింప బడెను‖ నడవా ‖
Verse
అబ్రాహాము నీతో నడిచాడు దేవ
విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో‖ నడవా ‖
Verse
నా జీవితమంతా నీతో నడవాలని
నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా‖ నడవా ‖