Chorus
నడిపించు చున్నాడు - నజరేయుడు
నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా‖ నడి ‖
Verse
నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా‖ 2x ‖
అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి‖ 2x ‖
ఊసుచెప్పినాడు - బాసచేసినాడు‖ 2x ‖
ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య‖ సడి ‖
Verse
ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా‖ 2x ‖
చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి‖ 2x ‖
ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు‖ 2x ‖
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా‖ స ‖