Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nadipinchu Na Naava Nadi Sandramuna Devaa

నడిపించు నా నావ నడి సంద్రమున దేవా

Nadipinchu Na Naava Nadi Sandramuna Devaa

Lyricist: A B Masilamani
Verse
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
నవజీవన మార్గమున - నా జన్మ తరియింప
Verse
నా జీవిత తీరమున - నా ఆపజయ భారమున
నలిగిన నా హృదయమను - నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలొ కాలిడుము - నా సేవ జేకొనుము‖ నడిపించు ‖
Verse
రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రాక్షించు నీ సిలువా - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ‖ నడిపించు ‖
Verse
ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశా నిరాశాయే - ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలో‖ నడిపించు ‖
Verse
ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రాపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై ఇపుడు - పాటింతు నీ మాట‖ నడిపించు ‖
Verse
లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటకు నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో - లోటైన నా బ్రతుకున్
లోపించని యర్పణగా - లోకేశ చేయుమయా‖ నడిపించు ‖
Verse
ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలొ పాదుకొని
ప్రకటింతును లోకములొ - పరిశుద్ధుని ప్రేమకధ
పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము జేతు

Related Tags

PrayerSurrenderGuidance