Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nadipinchu Naa Naavaa Nadi Sandramuna Devaa

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా

Nadipinchu Naa Naavaa Nadi Sandramuna Devaa

Verse
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప‖ నడిపించు ‖
Verse
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము‖ నడిపించు ‖
Verse
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ‖ నడిపించు ‖
Verse
ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు‖ నడిపించు ‖
Verse
ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట‖ నడిపించు ‖
Verse
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా‖ నడిపించు ‖
Verse
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు‖ నడిపించు ‖

Related Tags

DevotionalPrayerSurrender