Verse
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా
చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి‖ 2x ‖
Verse
అంధకారమే దారి మూసినా నిందలే నను కృంగదీసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు
Verse
కష్టాల కొలిమి కాల్చివేసినా శోకాలు గుండెను చీల్చివేసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు
Verse
నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు