Verse
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు‖ 2x ‖
అడుగులు తడబడినా – అలసట పైబడినా‖ 2x ‖
చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి‖ 2x నడిపిస్తాడు ‖
Verse
అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా‖ 2x ‖
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు‖ 2x నడిపిస్తాడు ‖
Verse
కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా‖ 2x ‖
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు‖ 2x నడిపిస్తాడు ‖
Verse
నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన‖ 2x ‖
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు‖ 2x నడిపిస్తాడు ‖