Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nadipisthaadu Naadhaevudu

నడిపిస్తాడు నాదేవుడు

Nadipisthaadu Naadhaevudu

Chorus
నడిపిస్తాడు నాదేవుడు
శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా‖ 2x ‖
చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి‖ 2x ‖
Verse
అంధకారమే దారిమూసినా -
నిందలె నన్ను కృంగదీసినా‖ 2x ‖
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు‖ నడిపిస్తాడు ‖
Verse
కష్టాలు కొలిమి కాల్చివేసిన
శోకాలు గుండెను చీల్చివేసినా
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యంవరకు నను చేర్చుతాడు‖ నడిపిస్తాడు ‖
Verse
నాకున్న కలిమి కలిగిపోయినా
నాయొక్కబలిమి తరిగిపోయినా
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యంవరకు నను చేర్చుతాడు‖ నడిపిస్తాడు ‖

Related Tags

FaithComfortGuidance