Verse
నడ్పుమీ, మహా యెహోవా
లోక యాత్ర యందున
నీదు శక్తి నాకు దిక్కు
నన్ రక్షింపఁ జేఁపట్టు
దివ్య మన్నా, దివ్య మన్నా‖ 2x ‖
నా కాహారమై యుండు.
Verse
ఊటగా స్వచ్ఛజలంబు
బండనుండి పారనీ
అగ్ని మేఘ స్తంభాలచే
నడవిన్ నన్ దాఁటించుఁ
గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ‖ 2x ‖
నాకు డాలవు సదా.
Verse
యొర్దాన్ నది దాఁటు వేళ
భీతు లెల్లఁ బాపుము
మృత్యు శ్రమ లన్ని నన్ను
క్షేమ కానాన్ జేర్చును
స్తుతి గీతి, స్తుతి గీతి‖ 2x ‖
నీ కర్పింతు నిత్యము