Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naedu Nae Naarakshakuni Naamadhiloa Chaerchukonnaanu

నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను

Naedu Nae Naarakshakuni Naamadhiloa Chaerchukonnaanu

Chorus
నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను
సమాధాన సంతోషము అనుభవించితి నేను
Verse
ప్రభువాక్యము నా పాపముచూపె – హృదయము విరిచె ఆయన ఆత్మ
గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని – కోరితి రక్తము మదిలో
Verse
ప్రభు నాపాపము చూపించగానే – ఒప్పుకొంటిని కప్పుకొనక
విశ్వాసముతో కన్నీటితో – ఒప్పుకొనగ క్షమియించె
Verse
పడమటికి తూర్పెంత దూరమో – నా పాపమునంత దూరపర్చితివి
సముద్ర అగాధములలోన – నా పాపము పడవేసె
Verse
మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె – నాశన గోతిలో నుండిలేపి
నీ వీపువెనుక నా పాపములు – పారవేసితివి వీవు
Verse
తుడిచితిననె ప్రభు నా పాపములు – జ్ఞాపకముంచుకొననని చెప్పె
మంచు విడిచిపోయినరీతి – నా పాపము తొలగించె

Related Tags

SalvationJoyConfession