Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naene Bhayapada Valadani Palikenu Mana Rakshakudu Yesuprabhu

నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసుప్రభు

Naene Bhayapada Valadani Palikenu Mana Rakshakudu Yesuprabhu

Chorus
నేనే భయపడ వలదని పలికెను
మన రక్షకుడు యేసుప్రభు
Verse
తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా
తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు
Verse
శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి
విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు
Verse
నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు
కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు
Verse
మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్
త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ
Verse
ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో
వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె
Verse
నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును
ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము

Related Tags

SalvationJesusHope