Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naenu Ghoarapaapini Chaeri Vaeduchumtini Kshmimchumu

నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము

Naenu Ghoarapaapini Chaeri Vaeduchumtini Kshmimchumu

Verse 1
Reference: నేను పాపములో పుట్టినవాడను కీర్తనలు Psalm 51:5
Chorus
నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము
Verse
ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన
ఆది దోషము అంటియుండెనయ్య – దాని నిర్మూలించు యేసయ్య
Verse
నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే
పాపము తోడనే పుట్టితి నేసయ్యా – దాని పరిహరింపుము
Verse
నా యపరాధము చేతను నే జేసిన పాపమందున
సత్యములేక నేజచ్చిన వాడను – ననుజీవింపచేయు యేసయ్యా
Verse
పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని
ఆపద గుర్తించ లేక నే గడిపితిని – దాపు జేరితి ప్రాపునీయుము
Verse
అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను
పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా – వచ్చి నీ ప్రాపున జేరితి
Verse
లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి
దావీదువలె బెత్షెబా బారిలో నుంటి – దేవా విమోచించు యేసయ్యా
Verse
ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి
నావలె మీనాగర్భములో నుంటి – నన్ను నీదరిజేర్చు మేసయ్యా

Related Tags

PrayerRepentanceConfession