Chorus
నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తు గాన
నేను నా సమస్తమును నాధు డేసు కిపుడు యిత్తు‖ నే ‖
Verse
నేను క్రీస్తు ననుభవించి నేను క్రీస్తు బోలియుందు నేను నా స్వరూపమందు
నా ప్రభుండు గానుపింప నేను నేసులో వసింతు‖ నే ‖
Verse
నేను క్రీస్తునందునుండి నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి
నేను క్రీస్తు మనసు నెపుడు గానుపఱతు నెల్లెడను‖ నే ‖
Verse
నేను క్రీస్తు సేవజేసి నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధ నంబె
నేను యనుభవించు రక్ష ణానందంబు జాటెదెపుడు‖ నే ‖
Verse
నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న
నాశన తనయుని శక్తి నేలగూలు నద్భుతముగ‖ నే ‖