Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naenu nee vaadanu dhaevaa nikkambuga

నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ

Naenu nee vaadanu dhaevaa nikkambuga

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను నీ వాఁడను దేవా వీనుల నీ
ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసఁగు
నీకిపుడు‖ నేను ‖
Verse
ఘనుఁడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను
నేను సేవింప‖ నేను ‖
Verse
నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను
నిల్పుచున్నది గాన‖ నేను ‖
Verse
నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార
నొసగితివి‖ నేను ‖
Verse
నే నఘముల చేత నిజముగఁ జావఁగ నీ నెనరుచే నన్ను నీవు
బ్రతికించితివి‖ నేను ‖
Verse
నా తనువు నాత్మయు నాకుఁ గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు
నీ కృప చేత‖ నేను ‖

Related Tags

SurrenderDevotionChristian