Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Najareyuda Na Yesayya Enniyugalakaina

నజరేయుడా నా యేసయ్యా ఎన్నియుగాలకైనా

Najareyuda Na Yesayya Enniyugalakaina

Verse
నజరేయుడా నా యేసయ్యా ఎన్నియుగాలకైనా
ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీకీర్తి నే చాటెద
Verse
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి
శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా
నీకే వందనం నీకే వందనం‖ 2x ‖
Verse
ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి
జలములలో బడి నేవెళ్ళినా నన్నేమి చేయవు నాయేసయ్యా
నీకే వందనం నీకే వందనం‖ 2x ‖
Verse
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా
సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నాయేసయ్యా
నీకే వందనం నీకే వందనం‖ 2x ‖

Related Tags

PraiseWorship