Verse
నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద‖ నజరేయుడా ‖
Verse
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి‖ 2x ‖
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య‖ 2x ‖
నీకే వందనం నీకే వందనం‖ 2x నజరేయుడా ‖
Verse
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి‖ 2x ‖
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా‖ 2x ‖
నీకే వందనం నీకే వందనం‖ 2x నజరేయుడా ‖
Verse
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా‖ 2x ‖
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా‖ 2x ‖
నీకే వందనం నీకే వందనం‖ 2x నజరేయుడా ‖