Verse
నాకై దీనునిగా భువికి వచ్చినావయా
పశువుల పాకలో పుట్టిన యేసయ్య
దివారాత్రములు స్తుతికి అర్హుడు నీవయ్య
స్తిరమైన ఇల్లు నీకు లేకుండెనా
Verse
ఆకాశపక్షులకు గూళ్ళు ఉండే
నక్కలకు బొరియలుండే
మనుష్యకుమారునికి స్థలమే లేకుండెనే
Verse
భూమి పునాదులు వేసినవానికి
సృష్టినంతటిని చేసిన వానికి
పశువుల పాకే మిగిలెనే
Verse
ఐనా నీవు తిరిగి వెళ్ళలేదయ్య
ఐనా నీవు విడిచి వెళ్ళలేదయ్య
మాతో నివసించినావయ్య
Verse
కన్నీటిని తుడిచే దైవమా
కిరిటము విడచినావుగ
కృంగి పడిన వేళలో
కదలి వచ్చినావయ్య
నలిగిన రెళ్ళును విరువవు
నీ ప్రేమతో చేర్చుకొందువు
అనాదగా ఎన్నడు విడువవు
ఆధారం నీవై ఉందువు