Verse
నాకోసం నీ ప్రాణం
ఎందుకలా ఇచ్చావు
నీవు మాట ఇచ్చావనా
నీవు మనసు ఇచ్చావనా
దేవా – ఎంత ప్రేమయ్యా – నా యేసయ్య
అర్హత లేదయ్యా – యోగ్యుని కానయ్య
Verse
నా రోగం భరియించి
నా వ్యసనం సహియించి
దోషమంత నాది కాగ
నాకొరకై నీవు నలిగితివా
నా శిక్ష నీపై పడిన
నీ నోరు తెరువకున్నావు
మౌనముగా ఉన్నావు
Verse
నా పాపం మోసితివి
అన్యాయం పొందితివి
వేదనెంతో భారమైన
చూసి తృప్తి పొందితివి
నీ ప్రాణము దారపోసి
పరిహారము చేసినావు
శుద్ధినిగా చేసావు
నిర్దోషిగా మార్చావు