Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naku Jivamainayunna Na Jivama

నాకు జీవమైనయున్న నా జీవమా

Naku Jivamainayunna Na Jivama

Verse
నాకు జీవమైనయున్న నా జీవమా
నాకు ప్రాణమైయున్న నా ప్రాణమా
నాకు బలమైయున్న నా బలమా
నాకు సర్వమైయున్న నా సర్వమా
నీ నామమే పాడెదన్ నా జీవితకాలమంతా
నీ ధ్యానమే చేసెదన్ నా ఊపిరి ఉన్నంత వరకు
Verse
పూజ్యుడవు ఉన్నత దేవుడవు
యోగ్యుడవు పరిశుద్ధ రాజువు
నా ఆరాధన నా ఆలాపన నా స్తుతి కీర్తన నీవే
నా ఆలోచన నా ఆకర్షణ నా స్తోత్రార్పణ నీవే
Verse
నాయకుడా నా మంచి స్నేహితుడా
రక్షకుడా నా ప్రాణనధుడా
నా ఆనందం నా ఆలంబన నా అతిశయము నీవే
నా ఆదరణ నా ఆశ్రయము నా పోషకుడవు నీవే

Related Tags

PraiseWorshipDevotional