Verse
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా‖ 2x ‖
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా‖ 2x నలుగకుండ ‖
Verse
పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా‖ 2x ‖
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా‖ 2x ‖
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా‖ 2x నలుగకుండ ‖
Verse
రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా‖ 2x ‖
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా‖ 2x ‖
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా‖ నలుగకుండ ‖