Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nalugakunda Godhumalu Kadupu Nimpagaluguna

నలుగకుండ గోధుమలు కడుపు నింపగలుగునా

Nalugakunda Godhumalu Kadupu Nimpagaluguna

Verse
నలుగకుండ గోధుమలు కడుపు నింపగలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా
Verse
పగలని బండనుండి జలములు ఊరునా
విరుగని పొలము మనకు పంటలీవ్వగలుగునా
పరలోకయాత్రలో పగులుటయే ఫలమయా
విశ్వాసి బాటలో విరుగుటయే వరమయా
Verse
రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా
బహుదూర బాటలో ప్రభు యేసే శరణమయా

Related Tags

FaithSacrificeSpiritual Journey