Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Namaskarimpa Randi Daaveedhu Puthruni

నమస్కరింప రండి దావీదు పుత్రుని

Namaskarimpa Randi Daaveedhu Puthruni

Verse 1
Reference: రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కీర్తన Psalm 95:7
Verse
నమస్కరింప రండి - దావీదు పుత్రుని
శ్రీ యేసు రక్షకుండు - ఏతెంచె నేలను
న్యాయంబు లోకమందు - స్థాపించి నిత్యము
అన్యాయమంత దాను - పోగొట్ట వచ్చెను
Verse
వర్షంబు పడునట్లు - శుష్కించు నేలను
దుఃఖించు వారికెల్ల - హర్షంబు నిచ్చును
శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు
ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు
Verse
దిగంత వాసులైన - భూరాజులందరు
శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు
భూలోకవాసులైన - జనంబులందరు
క్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు
Verse
విరోధులైన వారిన్ - జయింప నెన్నడున్
సింహాసనంబు మీద - నాసీనుడగును
అత్యంత ప్రేమమూర్తి - శ్రీ యేసు ప్రభువు
ఆ దివ్యనామ కీర్తి - వ్యాపించు నీ భువిన్

Related Tags

WorshipPsalm