Verse
పల్లవి: నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను
యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి
Verse
అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన
అమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును
Verse
నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందున
కరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును
Verse
యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిన
నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను
Verse
ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడయందున
నిందారహిత సంపూర్ణమహిమలో - నుండునట్లుగ నిల్పను
Verse
పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద
తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద
Verse
శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియు
శోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము