Verse
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా‖ 2x ‖
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా‖ 2x ‖
ఇంకేమి కోరుకోనయ్యా‖ 2x Nammakamaina ‖
Verse
ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా‖ 2x ‖
న్యాయము తీర్చే నీవు నాకుంటే‖ 2x ‖
చాలు యేసయ్యా‖ 2x Nammakamaina ‖
Verse
జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా‖ 2x ‖
శాపము బాపే నీవు నాకుంటే‖ 2x ‖
చాలు యేసయ్యా‖ 2x Nammakamaina ‖
Verse
కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా‖ 2x ‖
సాయము చేసే నీవు నాకుంటే‖ 2x ‖
చాలు యేసయ్యా‖ 2x Nammakamaina ‖