Verse
నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును‖ నమ్మకమైన ‖
Verse
కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన
స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన నా ప్రభున్
పొగడి నే స్తుతింతును‖ 2x నమ్మకమైన ‖
Verse
ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు
విడచియుంటినో ప్రభు
మన్ననతోడ నీ దరిన్
చేర్చి నన్ క్షమించితివి‖ 2x నమ్మకమైన ‖
Verse
కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి
పైకి లేవనెత్తితివి
భంగ పర్చు సైతానున్
గెల్చి విజయమిచ్చితివి‖ 2x నమ్మకమైన ‖
Verse
నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి
కోటగా నీవుంటివి
ప్రాకారంపు ఇంటివై
నన్ను దాచియుంటివి‖ 2x నమ్మకమైన ‖
Verse
సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై
నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా
ఆమేనంచు పాడెద‖ 2x నమ్మకమైన ‖