Verse
నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును
Verse
కరుణతోడ - పిల్చియు - స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన - నా ప్రభున్ - పొగడి - నే స్తుతింతును
Verse
ఎన్నోసార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు
మన్ననతోడ - నీదరిన్ చేర్చినన్ క్షమించితివి
Verse
కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి
భంగ పర్చు - సైతానున్ - గెల్చి విజయమిచ్చితివి
Verse
నా కాశ్రయశైలమై - కోటగా నీవుంటివి
ప్రాకారంపు - యింటివై - నన్ను దాచియుంచితివి
Verse
సత్య సాక్షివై యుండి - నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా - ఆమేనించు పాడెద