Verse
నమ్మకమైన నా స్నేహితుడు
నా ప్రభు యేసుడు‖ 2x ‖
ఎడబాయనివాడు విడువనివాడు‖ 2x ‖
నిన్న నేడు ఒకటిగనున్నవాడు‖ నమ్మకమైన ‖
Verse
ఆపదలో ఆనందములో నను వీడనివాడు‖ 2x ‖
వ్యాధిలో భాధలో‖ 2x ‖
నను స్వస్థపరచువాడు
అనుక్షణం నా ప్రక్కన నిలచి
ప్రతిక్షణం నా ప్రాణం కాచి‖ 2x ‖
అన్నివేళలా నన్నాదరించువాడు‖ 2x ‖
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు‖ 2x నమ్మకమైన ‖
Verse
కలిమిలో లేమిలో నను కరుణించువాడు‖ 2x ‖
కలతలలో కన్నీళ్ళలో‖ 2x ‖
నను ఓదార్చువాడు
కన్నతల్లిని మించిన ప్రేమతో
అరచేతిలో నను దాచినవాడు‖ 2x ‖
ఎన్నడు నన్ను మరువనివాడు‖ 2x ‖
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు‖ 2x నమ్మకమైన ‖