Verse
నమ్మకు ఇలలో ఎవరిని
సాయం చేస్తారనుకొని‖ 2x ‖
నమ్ముకో రక్షకుడేసుని‖ 2x ‖
కార్యం చూడు నిలుచొని‖ 2x నమ్మకు ‖
Verse
సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు
చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు
అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు‖ 2x ‖
శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు‖ 2x నమ్మకు ‖
Verse
నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే
మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే
నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు‖ 2x ‖
దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు‖ 2x నమ్మకు ‖
Verse
నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి
జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి
సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు‖ 2x ‖
రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు‖ 2x నమ్మకు ‖