Verse
నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా
మత్తును నమ్మకురాగమ్మత్తులు సేయకురా
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా
Verse
ధనము చదువు నేర్పునురా సంస్కారం నేర్పదురా
ధనము మందులు కొనునురా ఆరోగ్యం ఇవ్వదురా
వస్తువాహనాల కాధారం సుఖ సంతోషాలకు బహుదూరం
Verse
ధనము పెళ్ళి చేయునురా కాపురము కట్టదురా
ధనము సమాధి కట్టునురా పరలోకం చేర్చదురా
డబ్బును నమ్మకురాగబ్బు పనులు చేయకురా
Verse
ధనము ఆస్తిని పెంచునురా అనురాగం తుంచునురా
ధనము పొగరు పెంచునురా పరువు కాస్త తీయునురా
ధనము కోరిక తీర్చునురా నరకానికి చేర్చునురా