Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nammakuraa Nammakuraa

నమ్మకురా నమ్మకురా

Nammakuraa Nammakuraa

Verse
నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా‖ 2x ‖
మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా‖ నమ్మకురా ‖
Verse
ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా
ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా‖ 2x ‖
వస్తువాహనాల కాధారం
సుఖ సంతోషాలకు బహుదూరం‖ 2x నమ్మకురా ‖
Verse
ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా
ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా‖ 2x ‖
డబ్బును నమ్మకురా
గబ్బు పనులు చేయకురా‖ 2x నమ్మకురా ‖
Verse
ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా
ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా‖ 2x ‖
ధనము కోరిక తీర్చునురా
నరకానికి చేర్చునురా‖ 2x నమ్మకురా ‖

Related Tags

FaithGospelWarning