Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nammare Narulaara Yesuni Sammathiga

నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ

Nammare Narulaara Yesuni Sammathiga

Lyricist: Gella Ramayya
Chorus
నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి నమ్మిన వారల నిమ్ముగ
బ్రోచును సొమ్ముగ తను జేర్చి‖ నమ్మరె ‖
Verse
యేసు క్రీస్తుకంటెఁ పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన
దాసులుగాఁ దీసియు దోసముఁ బాపు సుమీ‖ నమ్మరె ‖
Verse
నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము
కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ‖ నమ్మరె ‖
Verse
తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను
మనలను పాలించును తండ్రిగ నమ్ముదము‖ నమ్మరె ‖
Verse
ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు
తెల్పె నిటు దీనుల కందఱికి‖ నమ్మరె ‖
Verse
ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము
మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై‖ నమ్మరె ‖
Verse
దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును
పాపికి నిఁక జీవనమై యుండున్‖ నమ్మరె ‖

Related Tags

RepentanceSalvationEvangelism