Chorus
నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు
ఇది ఆశజూపి మోసం జేయు ఈ మాయలోకం గనుక‖ నమ్మ ‖
Verse
మిమునుగన్న తల్లి యేది మిమ్మునుగన్న తండ్రియేడి
నాతోడబుట్టిన తోడులు యేరి వార్ని
కాటికి మోసిన కోటప్ప లేరి గనుక‖ నమ్మ ‖
Verse
మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు కట్టిన కోటలు
ఏవి కొట్టి తిన్న పొట్టలు ఉన్నవా?
మెట్టలు పల్లాలవ్వక మానునా గనుక‖ నమ్మ ‖
Verse
మీరు త్రవ్విన బావులు ఏవి మీరు త్రాగిన నదులు ఏవి
ఏరులు ఎండకుండునా? కారులు మరచెడకుండునా గనుక‖ నమ్మ ‖
Verse
మీరు కట్టిన బట్టలు ఏవి చుట్టి త్రాగిన చుట్టలు ఏవి
కట్టినబట్ట మట్టికెకదా? చుట్టిన చుట్ట అగ్గికి కదా గనుక‖ నమ్మ ‖
Verse
మనం మట్టినుండి తీయబడితిమి మట్టితో పుట్టబడితిమి ఎట్టి
బ్రతుకు బ్రతికినగాని కట్టెకాటికి పదపదరన్నా గనుక‖ నమ్మ ‖
Verse
యేసు ప్రభుని నమ్మండిప్పుడే మోసపోకుడి ఈ ధరణిలో
ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా గనుక‖ నమ్మ ‖