Verse 1
నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు
ఇలా. . ఎంత కాలము. . నీవు సాగిపోదువు. .
Verse
రాజులను నమ్మి బహుమతిని ప్రేమించినా
బిలాము ఏమాయెను? దైవదర్శనం కోల్పోయెను
నాయేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే
Verse
ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను? అగ్నికి ఆహుతి ఆయెను
నాయేసయ్యను నమ్మిన యెడల
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే
Verse
సుఖ భోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? రోగమును సంపాదించెను
నాయేసయ్యను నమ్మిన యెడల
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే